విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన సూర్య కుమార్ 

-

Surya kumar yadav closes in on all time T20 ranking record: టీ20ల్లో 360 డిగ్రీల బ్యాటింగ్‌‌తో పొట్టి ఫార్మాట్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు సూర్య. తాజాగా ఆల్ టైం టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన ఘనత దక్కించుకున్నాడు. గత రెండు టీ20ల్లో 51, 112 పరుగులతో సత్తాచాటిన సూర్యకుమార్ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారీగా రేటింగ్ పాయింట్లను పెంచుకున్నాడు. టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంటూ రేటింగ్ పాయింట్లను 883 నుంచి 908 వరకు మెరుగు పర్చుకున్నాడు. దీంతో ఆల్ టైం టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-2 ర్యాంక్‌కు ఎగబాకాడు.

- Advertisement -

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు ఐదో ర్యాంక్‌లో ఉన్న సూర్య(Surya kumar yadav).. బాబర్ ఆజామ్(896), కోహ్లీ(897), ఆరోన్ ఫించ్(900)లను వెనక్కినెట్టాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ 915 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సూర్య కేవలం 7 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. త్వరలో న్యూజిలాండ్‌‌తో జరిగే టీ20 సిరీస్‌లో సూర్య టాప్ ర్యాంక్‌కు చేరుకోవడం అంత కష్టమేమీ కాదు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో కోహ్లీ శతకంతో సత్తాచాటిన విషయం తెలిసిందే. అలాగే, కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ సైతం ఒక్క స్థానాన్ని వెనక్కినెట్టి 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తొలి వన్డేలో 2 వికెట్లతో సత్తాచాటిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 18వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...