తెలంగాణ CS గా శాంతికుమారి నియామకం.. రాష్ట్రంలో న్యూ రికార్డ్

-

Shanthi kumari Appointed as a chief secretary of telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. ఆమెను రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను ఏపీ క్యాడర్ కి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన స్థానంలో శాంతికుమారిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శేషాద్రి బుధవారం మధ్యాహ్నం ఆర్డర్స్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎస్‌గా నియమితులై శాంతికుమారి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ విభజన సమయంలో తెలంగాణ కేడర్‌గా అలాట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎంఓ కార్యదర్శిగా, కరోనా సమయంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

- Advertisement -

సీనియారిటీ ప్రకారం ఆమెకంటే పలువురు ఐఏఎస్‌లు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ శాంతికుమారి(Shanthi kumari)కి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆర్థిక శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు పేరు సైతం పరిశీలనలో ఉన్నా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఇద్దరితో చర్చలు జరిపిన తర్వాత శాంతికుమారి పేరును ఫైనల్ చేశారు. ఆమె 2025 ఏప్రిల్ వరకూ సర్వీసులో కొనసాగనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమెకు సీఎస్‌గా అవకాశం కల్పించడం గమనార్హం. రామకృష్ణారావును సీఎస్‌గా నియమిస్తున్నట్లు వార్తలు వచ్చినా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖ స్పెషల్ సీఎస్‌గానే కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆయనే ఆ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...