Joshimath sank 5.4cm in 12 days, Isro releases images: ఉత్తరాఖండ్‌లో జోషీమఠ్ కుంగుబాటుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షాకింగ్ రిపోర్ట్ బయటపెట్టింది. 12 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో 5.4 సెంటిమీటర్లు భూమి కుంగుబాటుకు గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ ఫొటోలు రిలీజ్ చేసింది. డిసెంబర్ 27 నుంచి జనవరి 8 మధ్య కుంగుబాటుకు గురైనట్టు తెలిపింది. ఈ నెల 2న కుంగుబాటు తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్న రిపోర్ట్… తాజా కుంగుబాటుతో పోలిస్తే గతేడాది ఏప్రిల్, నవంబర్ మధ్య కుంగుబాటు 9 సెంటిమీటర్లుగా ఉందని వెల్లడించింది. కార్టోసాట్-2ఎస్ శాటిలైట్ నుంచి ఈ చిత్రాలు తీసినట్లు పేర్కొంది.
ప్రస్తుతం కుంగుబాటుకు గురవుతున్న ఈ టెంపుల్ టౌన్(Joshimath) ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు గేట్ వేగా ఉంది. శాటిలైల్ సర్వే తర్వాత 4వేల మంది రిలీఫ్ క్యాంపులకు తరలించగా, నిర్మాణాత్మక పనులను నిలిపివేశారు. మరోవైపు ఇప్పటికే సీఎం పుష్కర్ సింగ్ ధామి 3వేల కుటుంబాలకు రూ.45 కోట్ల పరిహారం ప్రకటించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా పరిస్థితిని ఎప్పటికప్పుడూ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.