Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023లో భాగంగా ‘గ్రూప్-డి’లో వేల్స్, భారత్ జట్టులు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఒడిస్సా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 4-2 తేడాతో వేల్స్ ను ఓడించి భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ తరుపున ఆకాశీప సింగ్ 2 గోల్స్ చేయగా.. షంషేర్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ చెరో గోల్ సాధించారు. గారెత్, జాకబ్ వేల్స్ కు ఒక్కో గోల్ అందించారు. ఇక, క్రాస్ ఓవర్ మ్యాచ్ లో పూల్ సీలో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఆదివారం భారత్ తో తలపడనుంది. ఆ క్రాస్ ఓవర్ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటుంది.