RV University allotted Rs 10 crore for Merit Scholarships: ఆర్వి విశ్వవిద్యాలయము (ఆర్వియు), లిబరల్ విద్యకు ఉద్దేశించబడిన భారతదేశపు కొత్త-యుగపు, టెక్-డ్రివెన్ ప్రపంచ వ్యాప్త విశ్వవిద్యాలయము, 2023 ఆగస్టులో మొదలయ్యే రాబోయే అకాడెమిక్ సంవత్సరముకి మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ|| 10 కోట్లు కేటాయించింది. ఇది 500+ అండర్ గ్రాడ్యువేట్ మరియు పోస్ట్ గ్రాడ్యువేట్ డిగ్రీ ప్రోగ్రాముల విద్యార్ధులకు లబ్ధిని చేకూరుస్తుంది.
స్కూలు ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగులోని ఇంచుమించు 200 మంది బి.టెక్. విద్యార్ధులు మరియు 50 బి.ఎస్సి. విద్యార్ధులు ఈ స్కాలర్షిప్స్ నుంచి లాభము పొందుతారు, అలాగే స్కూలు ఆఫ్ లాలోని అయిదు-సంవత్సరాల బి.ఎ.ఎల్ఎల్బి. మరియు బి.బి.ఎ.ఎల్ఎల్బి. చదివే 75 విద్యార్ధులు మరియు ఎల్ఎల్.ఎం. ప్రోగ్రాములలోని వారు కూడా లబ్ధి పొందుతారు. స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఎండ్ సైన్స్ మరియు స్కూల్ ఆఫ్ డిజైన్ ఎండ్ ఇన్నోవేషన్ నుంచి – అంటే ప్రతి స్కూలు నుంచి 40 విద్యార్ధులను కవర్ చేస్తాయి ఈ స్కాలర్షిప్స్. స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బి.బి.ఎ, బి.కాం. మరియు బి.ఎ. (ఎకనామిక్స్) ప్రోగ్రాముల విద్యార్ధులకు 80 మెరిట్ స్కాలర్షిప్స్ ప్రొపోజ్ చెయ్యబడ్డాయి.
బెంగుళూరు-ఆధారముగా వున్న ఆర్వియు ఈ స్కాలర్షిప్సుని విశిష్టమైన మెరిట్ కలిగిన విద్యార్ధులకు వారి విద్యా ఆశయాలు పొందేలా చెయ్యడానికి మరియు భవిష్యత్తు లీడర్ల టాలెంట్-పూలుని సృష్టించడము కొరకు అందిస్తోంది. వీటిలో మొదటి సంవత్సరము చదువుకి 100%, 50% మరియు 25% స్కాలర్షిప్స్ ఇవ్వబడ్డాయి. ఈ స్కాలర్షిప్స్ యొక్క రెన్యువల్ మెరిటుని మెయింటేన్ చేసుకునే దాని మీద ఆధారపడి వుంటుంది. 2023-2024 సంవత్సరముల అడ్మిషన్లు తెరిచి వున్నాయి కాబట్టి, ఈ సంవత్సరపు స్కాలర్షిప్స్ కొరకు విద్యార్ధులు అప్లై చేసుకోవచ్చు.
2021లో ప్రారంభమైన మొదటి సంవత్సరములో ఆర్వియు 100 స్కాలర్షిప్స్ అందించింది, ఇందులో కోవిడ్ సమయములో ఒకరిని లేక తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్న విద్యార్ధులకు ఇచ్చిన 100% స్కాలర్షిప్స్ కూడా వున్నాయి. 2022వ సంవత్సరములో, ఇంచుమించు 200 విద్యార్ధులకు రూ|| 3 కోట్లు విలువగల స్కాలర్షిప్స్ ఇచ్చారు. విశ్వవిద్యాలయము క్రమము తప్పకుండా స్కాలర్షిప్ కార్పస్ ఫండుని పెంచుతోంది. ఈ ఫండ్ విశిష్టమైన మెరిట్ కలిగిన విద్యార్ధుల కొరకు మరియు సమాజములోని ఆర్ధికముగా బలహీనపు వర్గాలకు చెందిన విద్యార్ధుల కొరకు ఉద్దేశించబడింది. https://admissions.rvu.edu.in/ వద్ద విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చు, మరియు అడ్మిషన్స్ టీంని కాంటాక్ట్ చెయ్యటం ద్వారా ఈ ప్రక్రియ గురించి అధికముగా తెలుసుకోవచ్చు.
ప్రొఫెసర్ వై.ఎస్.ఆర్. మూర్తి, వైస్-ఛాన్సలర్, ఆర్వి విశ్వవిద్యాలయము, బెంగళూరు ఇలా అన్నారు, “మేము అర్హత వున్న విద్యార్ధులకు ఈ మెరిట్ స్కాలర్షిప్స్ ప్రకటించడానికి అనందిస్తున్నాము. 2021 నుంచి మా మిషనులో మౌలిక భాగముగా అకాడెమిక్ శ్రేష్ఠత వుంది. గత సంవత్సరాలలో మేము క్రమము తప్పకుండా స్కాలర్షిప్ ఫండ్సుని పెంచుతున్నాము. సమాజములోని అన్ని స్థాయిల విద్యార్ధులకు విద్యా ఫలములను అందించినందుకు నేను రాష్ట్రీయ శిక్షణా సమితి ట్రస్టుకి మనఃపూర్వకముగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. తరవాతి తరము లీడర్లను తయారుచేయడానికి మరియు దేశ నిర్మాణము చెయ్యడానికి ఈ స్కాలర్షిప్స్ మాకు సహాయము చేస్తాయి.”
ప్రో ఛాన్సలర్, ఆర్వి విశ్వవిద్యాలయము మరియు ఆర్ఎస్ఎస్టి, డా. (హెచ్.సి.) ఎ.వి.వస్. మూర్తి ఇలా అన్నారు, “సమాజములోని ప్రతి స్థాయి విద్యార్ధులకు విద్యను అందుబాటులో వుంచాలన్నది మా ట్రస్ట్ యొక్క ఒప్పుకున్న లక్ష్యము. కేవలము మూడవ సంవత్సరములోనే ఆర్వియు కార్యకలాపాలలో, మేము స్కాలర్షిప్ ఫండ్సుని 20 సార్లు పెంచాము. సాధ్యమైనంత ఎక్కువమంది విద్యార్ధులకు విద్యను అందించాలి అనే మా నిబద్ధతకి ఇది ఒక గొప్ప ప్రమాణం. అర్హత కలిగిన విద్యార్ధులు ఈ స్కాలర్షిప్సుని ఉపయోగించుకుంటారని మరియు వారి పూర్తి శక్తి సామర్ధ్యములను దేశము కొరకు వినియోగిస్తారని నేను ఆశిస్తున్నాను.”
ప్రెసిడెంట్, ఆర్ఎస్ఎస్టి, డా. ఎం.పి. శ్యామ్ ఇలా అన్నారు, “అవసరములో వున్న విద్యార్ధులకు ప్రపంచ-స్థాయి విద్యను అందుబాటులోకి తేవాలన్న మా ట్రస్ట్ మిషనుకి స్కాలర్షిప్స్ ఇవ్వడము అనే స్పూర్తి సరిపోతుంది. చదువు యొక్క వైబ్రెంట్ ఇంటర్ డిసిప్లినరీ ఇకోసిస్టముని అందిస్తాము అని అర్వియు వాగ్దానము చేస్తోంది. స్కాలర్షిప్సుకి ఫండ్ అందించడానికి విశేషమైన కార్పసుని సృష్టించడానికి మేము నిబద్ధతతో వున్నాము. ఆర్వి విశ్వవిద్యాలయము యొక్క స్కాలర్షిప్ ఫండుకి సహాయము చెయ్యమని పరోపకారులను మరియు సమాజము పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులను నేను ప్రార్ధిస్తున్నాను.”
ఎవరు ముందు వస్తే-వారికి స్కాలర్షిప్స్ ఇవ్వబడతాయి (ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్డ్ బేసిస్). మొదటి సంవత్సరములో చూపిన విశిష్టమైన ప్రదర్శన ఆధారముగా స్కాలర్షిప్స్ రెన్యువల్ చెయ్యబడతాయి. అన్ని రాష్ట్రములు, సెంట్రల్ బోర్డు, మంచి అకాడెమిక్ ప్రదర్శన కలిగి గుర్తింపు పొందిన ఇతర భారతదేశపు ఇన్స్టిట్యూట్లకు ఈ స్కాలర్షిప్స్ ఒపెనుగా వుంటాయి. ట్యూషన్ ఫీజు ఖర్చుని పూర్తిగా కాని లేదా పాక్షికముగా కాని ఈ అమౌంట్ కవర్ చేస్తుంది. విద్యార్ధులు https://admissions.rvu.edu.in/ వద్ద రిజిస్టర్ చేసుకుని, అడ్మిషన్స్ టీంని కాంటాక్ట్ చెయ్యడము ద్వారా ఈ ప్రక్రియ యొక్క అధిక వివరాలు తెలుసుకోవచ్చు.
అండర్-గ్రాడ్యువేట్, పోస్ట్-గ్రాడ్యువేట్ మరియు ఫుల్-టైమ్/పార్ట్-టైమ్ పిహెచ్.డి. ప్రోగ్రాములకు అడ్మిషన్లు ఇప్పటికే నడుస్తున్నాయి. ఈ స్కాలర్షిప్స్ ఆర్వి విశ్వవిద్యాలయము యొక్క ఆరు స్కూళ్ళలో విస్తరించి వున్నాయి. స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఎండ్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ డిజైన్ ఎండ్ ఇన్నోవేషన్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఎండ్ సైన్సెస్ మరియు స్కూల్ ఆఫ్ లా ద్వారా ఆర్వి విశ్వవిద్యాలయము 45+ డిగ్రీ ప్రోగ్రాములు అందిస్తోంది.
- Read Also:
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. MSDE కీలక నిర్ణయం