IDFC AMC Appoints Manish Gunwani as Head Equities: దేశంలో టాప్ 10 ఏఎంసీలలో ఒకటైన ఐడీఎఫ్‌సీ ఎస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐడీఎఫ్‌సీ ఏఎంసీ) తమ హెడ్– ఈక్విటీస్‌గా మనీష్ గున్వానీని నియమించినట్లు వెల్లడించింది. ఈ నూతన బాధ్యతలలో మనీష్ ఈ ఫండ్ హౌస్ యొక్క ఈక్టిటీ ఫండ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను చూడనున్నారు.
ఈక్విటీ పరిశోధన, ఫండ్ మేనేజ్‌మెంట్ రంగాలలో దాదాపు 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన గున్వానీ, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ –ఈక్విటీగా నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌కు వ్యవహరించారు. అంతకుముందు డిప్యూటీ సీఐఓ (ఈక్విటీస్) ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్ ఏఎంసీగా కూడా వ్యవహరించారు. ఐఐటీ మద్రాస్ నుంచి శ్రీ గున్వానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ఐఐఎం బెంగళూరు నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో చేశారు.
ఈ నియామకం గురించి ఐడీఎఫ్‌సీ ఏఎంసీ సీఈఓ విశాల్ కపూర్ మాట్లాడుతూ ‘‘మనీష్ గున్వానీ(Manish Gunwani) మా బోర్డ్ పై రావడం ఆనందంగా ఉంది. మనీష్ యొక్క నైపుణ్యం, విజయవంతమైన ట్రాక్ రికార్డ్ మా ఈక్విటీ ఫ్రాంచైజీని మరింతగా వృద్ధి చేయనుంది. ఆయన నాయకత్వ పటిమతో పాటుగా మా ప్రతిభావంతులైన ఈక్విటీస్ బృందం, మా శక్తివంతమైన సంస్ధాగత కార్యాచరణ మా ఏఎంసీ తరువాత దశ వృద్ధికి తోడ్పడనున్నాయి. ఐడీఎఫ్‌సీ ఏఎంసీకి ఇప్పటి వరకూ తోడ్పాటునందించి, కెరీర్ పరంగా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్న అనూప్ భాస్కర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాము’’ అని అన్నారు.
మనీష్ గున్వానీ మాట్లాడుతూ‘‘దేశంలో టాప్ 10 ఏఎంసీలలో ఐడీఎఫ్‌సీ ఏఎంసీ ఒకటి. ఈ టీమ్‌తో చేరడంతో పాటుగా ఏఎంసీ తరువాత దశ వృద్ధి ప్రయాణంలో భాగం కావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.