G Square to expand housing projects in North India soon: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీస్క్వేర్ హౌసింగ్ ఇటీవలనే దక్షిణ భారతదేశంలో రెండు అతి ముఖ్యనగరాలు– హైదరాబాద్ మరియు మైసూరులకు విస్తరించింది. గత మూడు నెలల కాలంలో 10 నూతన ప్రాజెక్టులను సైతం జీస్క్వేర్ ఆవిష్కరించింది. వీటిలో కర్నాటకలో ఓ ప్రాజెక్టు విలువ 1000 కోట్ల రూపాయలు అయితే, హైదరాబాద్‌లో మరో ప్రాజెక్ట్ ఎక్వైజేషన్ విలువ 2500 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఇవి కాక తమిళనాడులో 2వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా ఉంది. గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ గణనీయమైన వృద్ధి నమోదు చేయడంతో పాటుగా తమ ఉద్యోగుల సంఖ్యను సైతం 600 నుంచి 1300కు వృద్ధి చేసి 2వేల కోట్ల రూపాయల విక్రయాలనూ నమోదు చేసింది. త్వరలోనే ఈ కంపెనీ పూనె, జైపూర్‌లలో సైతం విస్తరించేందుకు ప్రణాళికలను తీర్చిదిద్దింది.
ఈ కంపెనీ హైదరాబాద్‌లో తమ మొట్టమొదటి ప్రాజెక్ట్ జీస్క్వేర్ ఈడెన్ గార్డెన్‌ను ప్రారంభించింది. దీనికి వినియోగదారుల నుంచి అపూర్వ స్పందన లభించింది. కేవలం నాలుగు రోజుల్లో 250కు పైగా బుకింగ్స్ జరిగాయి. ఇదే రీతిలో ఇటీవలి కాలంలో మైసూరులో ప్రారంభించిన జీస్క్వేర్ ప్లాసియా ; హైదరాబాద్‌లో ప్రారంభించిన జీస్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీకు అపూర్వ స్పందన లభించింది.
జీస్క్వేర్(G Square) యొక్క ప్లాట్ ప్రాజెక్టులు విస్తృత శ్రేణి ఫీచర్లు, సేవలతో వస్తాయి. జీస్క్వేర్ ప్లాట్స్ ప్రైమ్ లొకేషన్ ్సలో గేటెడ్ ప్లాట్ కమ్యూనిటీలుగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌లన్నీ కూడా ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు కలిగి ఉండటంతో పాటుగా భూగర్భ విద్యత్, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలతో పాటుగా అంతర్గత బ్లాక్ టాప్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ల్యాండ్ స్కేపింగ్ వంటి సదుపాయాలతో ఉంటాయి.
జీస్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ ‘‘పలు అంతర్జాతీయ శ్రేణి సౌకర్యాలు, ఫీచర్లను మా వినియోగదారులకు అందించడం పై జీస్క్వేర్ వద్ద మేము దృష్టి సారించాము. తమిళనాడు, కర్నాటక, తెలంగాణా మార్కెట్‌లలో మేము అద్భుతమైన ప్రదర్శన కొనసాగించాము. త్వరలోనే ఉత్తర భారతదేశంలో కూడా కార్యకలాపాలు విస్తరించనున్నాము. ప్లాట్ ప్రాజెక్ట్‌లకు అత్యధిక డిమాండ్ కలిగిన జైపూర్‌తో పాటుగా పూనెలలో కూడా కార్యకలాపాలు ప్రారంభించనున్నాము. మా ప్రాజెక్ట్‌లన్నీ కూడా వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలలో ఉండటంతో అందుబాటు ధరలలో మెరుగైన ఫీచర్లు కలిగి ఉండటం చేత తమ సొంత ప్లాట్‌లో ఇంటిని తమకు నచ్చిన రీతిలో కట్టుకోవాలని తలిచే వినియోగదారుల కలలను సాకారం చేస్తున్నాము’’ అని అన్నారు.