Union Budge 2023: నేటి నుంచే యూనియన్ బడ్జెట్ సమావేశాలు

-

Union Budge 2023 President Murmu to address joint sitting of two Houses: యూనియన్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆమె ప్రసంగంతో సెషన్ ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థిక బిల్లుకు ధన్యవాద తీర్మానంపై ఆమోదం పొందనుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపది ముర్ము ఇరు సభలనుద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. ప్రసంగం అనంతరం కేంద్రం ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనుంది. మరుసటి రోజైన బుధవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్ కానుంది. బడ్జెట్ సమావేశాలు 31 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. 66 రోజులపాటు 27 సిట్టింగుల్లో కొనసాగనున్న ఈ బడ్జెట్ సెషన్‌ తొలి విడత.. ఫిబ్రవరి 14 వరకు జరగనుంది. డిపార్ట్‌మెంట్ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు గ్రాంట్‌ల డిమాండ్‌లను పరిశీలించడానికి, నివేదికలను రూపొందించడానికి ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు విరామం ఉంటుంది. ఆ తర్వాత రెండో విడత ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనుంది. ఈ సెషన్‌‌లో బడ్జెట్ ప్రక్రియకు సంబంధించిన 4 బిల్లులు సహా మొత్తం 36 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు, బడ్జెట్‌లో కేటాయింపులు, అదానీ-హిండన్‌బర్గ్ వ్యవహారం సహా దేశంలో నెలకొన్న ఇతర సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...