ఏపీ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతోకుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన అపోలో వైద్యులు చంద్రశేఖర్ రెడ్డి గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం చెన్నెకి తరలించాలని కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యేకి గుండెపోటు.. పరిస్థితి విషమం
-