పొత్తులపై సీపీఐ(CPI) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva rao) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై బీఆర్ఎస్(BRS)తో చర్చలు జరుపలేదని, మా అవసరం ఉంటే వాళ్లే తమ వద్దకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని వ్యతిరేకించే క్రమంలో బీజేపీకి మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం కలిసి నడవాలని ఫిక్స్ అయినట్లు ప్రకటించారు. తమకు రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన కేడర్ ఉందని, తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించే శక్తి కమ్యూనిస్టులకు ఉందని వ్యాఖ్యానించారు. రబీ సీజన్లో 24 గంటల కరెంట్ సరఫరా అయ్యేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలన్నారు. తమ పోరాటం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం పొడు భూముల పట్టాలను ఇస్తోందన్నారు. అదానీ అంశంపై ప్రధాని మోడీ ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణమన్నారు.