సై రా సినిమా తో మంచి విజయోత్సాహంలో ఉన్న చిరు ఆ ఉత్సాహంతోనే అందరి పొలిటిషన్స్ ని కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మొన్న జగన్ నిన్న వెంకయ్య నాయుడు ఇలా అవకాశం ఉన్న అందరు పొలిటిషన్స్ ని కలిసి తన ఆనందాన్ని పంచుకుంటున్నారు.. నిన్నటి దాకా చిరు వీరిని కలవడం వెనుక ఉన్న విషయం ఇదే అనుకున్నారు.. కానీ అసలు విషయం వేరే ఉందట..
ఈ మెగా పొలిటికల్ మీటింగులు? అవార్డుల కోసమని ఫిలింనగర్ గుసగుస. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డుల కోసం మెగాస్టార్ ఇప్పటి నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం మాస్ కమర్షియల్ అంశాలకు దూరంగా ‘రుద్రవీణ’ సినిమా చేశారు మెగాస్టార్. మళ్ళీ ఇన్నాళ్లకు తన సహజశైలికి భిన్నంగా ‘సైరా నరసింహారెడ్డి’ చేశారు. ఇందులో మెగాస్టార్ నుండి ఫ్యాన్స్ ఆశించే మాస్ పాటల్లేవ్. కమర్షియల్ ఫైటుల్లేవ్. కథ ప్రకారం సినిమా చేశారు.
అందులోనూ స్వాతంత్య సమర శంఖాన్ని పూరించిన వ్యక్తి కథ. ముందుగా ఈ సినిమాను రాజకీయ ప్రముఖులకు చూపిస్తే సినిమా గొప్పదనం వారికీ తెలుస్తుంది. అవార్డుల సమయంలో సినిమాకు అడ్వాంటేజ్ ఉంటుందని ఇలా చేస్తున్నారని టాక్. వచ్చే ఏడాది అవార్డులు ప్రకటిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.