చైతు ని పట్టించుకోని రష్మిక..!!

చైతు ని పట్టించుకోని రష్మిక..!!

0
89

రష్మిక మందన్న.. చలో సినిమా తో తెరమీదకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది..అయితే ఈ ముద్దుగుమ్మ కి ఓ సినిమా కథ మళ్ళీ చెప్పమని చెప్పేసిందట.. శశి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనుండగా.. వచ్చే ఏడాది షూటింగ్ మొదలెట్టాలని ప్లానింగ్ కూడా పూర్తైంది. నాగచైతన్య హీరో .. ఈ టైంలో రష్మిక ఇలా సెకండ్ నేరేషన్ ఇవ్వమని అడగడంతో.. దర్శకనిర్మాతలు కాస్త టెన్షన్ పడ్డారట. మరి రెండోసారి విని రష్మిక ఏమైనా మార్పులు చేయమని కోరుతుందా లేక ఇంకేమైనా అంటుందా అని టెన్షన్ పడుతున్నారు.

ఇకపోతే.. ప్రస్తుతం మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో వరుస సినిమాలు చేస్తున్న రష్మిక, త్వరలోనే తమిళంలోనూ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకొనేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్కడ విజయ్ సరసన నటించే అవకాశం కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తోంది. రష్మిక ఇదే పరుగు ఇంకొన్నాళ్లు కంటిన్యూ చేసిందంటే.. నెంబర్.1 హీరోయిన్ అయిపోవడం ఖాయం.