Tarakaratna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో కొద్దిసేపటి క్రితం ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తారకరత్న కు తుది వీడ్కోలు పలికారు. ఫిలింఛాంబర్ నుంచి తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కాగా.. నందమూరి బాలకృష్ణ ఆయన పాడె మోశారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ చేతులమీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. జనవరి 27న తీవ్ర గుండెపోటుకు గురైన తారకరత్న.. బెంగుళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ ఈ నెల 18న కన్నుమూశారు.