‘పుష్ప’ సక్సెస్‌కు కారణం ఆయనే.. డైరెక్టర్ Sukumar ఆసక్తికర వ్యాఖ్యలు

-

Sukumar | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో బన్నీ సత్తా ఏంటో తెలిసేలా చేసింది. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ దేశాన్ని కుదిపేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా పుష్ప సినిమాపై దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, దక్షిణ్ – సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సమ్మిట్‌లో ఎస్ఎస్ రాజమౌళి, మణిరత్నం, సుకుమార్ వంటి దర్శకులు హాజరయ్యారు.

- Advertisement -

ఈ సమ్మిట్‌లో ప్రధానంగా సినిమా ట్రెండ్, ఇండస్ట్రీ భవిష్యత్తు గురించి చర్చించారు. ఈ క్రమంలోనే సుకుమార్ పుష్ప సీక్రెట్ బయటపెట్టాడు. ‘పుష్ప’ మూవీ సక్సెస్‌లో దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) పాత్ర ఉందని చెప్పాడు. ఎందుకంటే.. ముందుగా ‘పుష్ప’ను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని సుకుమార్ అనుకున్నారు. కానీ హిందీ పుష్ప క్రేజ్ మామూలుగా లేదని, దీనిని హిందీలోనూ విడుదల చేయాలని ప్రమోషన్స్‌లో రాజమౌళి సుకుమార్‌కు(Sukumar) సూచించాడు. దీంతో ‘పుష్ప’ను పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆ విధంగా అన్ని భాషల్లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

 Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...