Kishan Reddy | కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి(50) గుండెపోటుతో మృతిచెందాడు. సైదాబాద్ వినయ్ నగర్‌లో నివాసముండే కిషన్ రెడ్డి సోదరి లక్ష్మి కుమారుడు అయిన జీవన్ రెడ్డి గురవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించి వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు కాంచనబాగ్ డీఆర్డీఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి మృతిచెందారు. అంత్యక్రియలు శనివారం జరుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కేంద్రమంత్రి అల్లుడి మరణవార్త తెలిసిన బీజేపీ శ్రేణులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Kishan Reddy | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం
-