ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది…. దేశంతో ఎక్కడా లేని విధంగా వైసీపీ సర్కార్ పాలన సాగిస్తోందని తప్పు బట్టింది… ఏపీలో శాశ్విత రాజధానిలేని రాష్ట్రంగా నిలబెట్టి పాలనా పరమైన సౌలభ్యం లేకుండా చేయడమే ప్రభుత్వం విధానంగా ఉందని ద్వజమెత్తింది..
ప్రస్తుతం ప్రభుత్వ నాయకులు నిపుల అన్వేషణ అంటూ కాలయాపన చేస్తున్నారని జనసేన పార్టీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది… పిల్లి కాపురం కోసం ఆరు చోట్ల మార్చిందన్న చందంగా వైసీపీ నాయకులు రాజధాని అక్కడా ఇక్కడా అని చెప్పి చివరకు ఏం లేకుండా చేస్తున్నారని ఆరోపించింది…
ఇటీవలే బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టిస్తోందని అన్నారు… కాగ గతంలో కూడా రాజధాని విషయంలో బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇప్పుడు ఇదే రీతిలో చర్చ సాగింది తాజాగా ఆయన మరోసారి రాజధాని విషయంలో మాట్లాడిన మాటలు ప్రతిపక్షాలకు మరింత కాక పుట్టిస్తున్నాయి…