Preethi Case |తెలంగాణ గవర్నర్‌పై పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి సోదరి దీప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థినిని పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై పూలదండతో వచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూలదండ చనిపోయిన వారిపై వేస్తారని, గవర్నర్ మా అక్క మీద పూలదండ వేయడానికి వచ్చిందా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నర్‌కు అన్ని అధికారాలు ఉంటాయని, మా అక్కకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు సరైన వైద్యం అందడం లేదని.. దయచేసి మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ పరామర్శించడానికి రావొద్దని కోరారు. ఈ ఘటనపై నిందితుడిని ఉరి తీయాలని దీప్తి డిమాండ్ చేశారు.
Preethi Case |తెలంగాణ గవర్నర్‌పై ప్రీతి సోదరి దీప్తి సీరియస్
-