బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద షర్మిల దీక్షకు దిగారు. అత్యాచాలు, కిడ్నాప్‌లలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని, కేసీఆర్ పాలనలో మహిళలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మారిపోయారన్నారు. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఎంతోమంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ నియోజవర్గంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే స్పందించిన నాథుడే లేడని అసహనం వ్యక్తం చేశారు. కవిత సిగ్గులేకండా లిక్కర్ వ్యాపారం చేసి ఆ స్కామ్‌లో చిక్కుకుని మహిళల గౌరవాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్‌లో మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదని వెల్లడించారు.
Read Also: MLC కవితకు ఈడీ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే!
Follow us on: Google News