ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ కేసును పక్కదారి పట్టించేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేశారని విమర్శించారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత మహిళా రిజర్వేషన్లపై అప్పుడు ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడలేదని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డా.. ఆరోపణలు ఎదుర్కొన్నా పార్టీ నుంచి బహిష్కరిస్తానని గతంలో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులు హెచ్చరించారని, మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కూతురు కవితను ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించడం లేదని రేవంత్ రెడ్డి అడిగారు.
కేవలం అవినీతి ఆరోపణలు వచ్చాయనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగించారని గుర్తుచేశారు. రాజయ్య విషయంలో ఇప్పటివరకు ఆయన చేసిన అవినీతి ఏంటో కూడా బయటకు చెప్పలేదని మండిపడ్డారు. దేశాన్ని కుదిపేస్తోన్న లిక్కర్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కూతురు కవితను తప్పనిసరిగా పార్టీ నుంచి బహిష్కరించాలని రేవంత్(Revanth Reddy) డిమాండ్ చేశారు.
Read Also: షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు: సీఎం కేసీఆర్
Follow us on: Google News