జనసేన పార్టీ తరపున ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యేకు కూడా ప్రస్తుతం షాక్ లు తగులుతున్నాయి… రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు జనసేన పార్టీ తరపున తన వాయిన్ అసెంబ్లీలో వినిపిస్తున్నారు…
ఈ ఎమ్మెల్యేకు తాజాగా కోర్టు నోటీసులు జారీ చేసింది దీంతో రాపాకు ఎమ్మెల్యే పదవి ఉంటుందో ఊడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది… అసలు విషయం ఏంటంటే హోరా హోరిగా జరిగిన 2019 ఎన్నికల్లో రాపాక తన నియోజకవర్గంలో రిగ్గింగ్ కు పాల్పడ్డారని వైసీపీ అభ్యర్థి బొంతు రామేశ్వర రావు కోర్టులో పిటీషన్ వేశారు…
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాపాక వరప్రసాద రావుకు నోటీసులు జారీ చేసింది… ఆయన పై వస్తున్న ఆరోపణలను వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది న్యాయస్థానం…