తాను ఇంత త్వరగా రోడ్ల మీదకు వస్తానని అనుకోలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా కూడా తాను రోడ్లమీదకు వస్తానని అనుకోలేదని అన్నారు…
ప్రజలు వైసీపీపై ఉంచుకున్న నమ్మకాన్ని నాయకులు పలచన చేశారని అన్నారు… రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యలే తలెత్తుతున్నాయని పవన్ తెలిపారు… గతంలో తనకు ఓట్లు వేయలేదు కదా ఎందుకు పోరాడాలి అనుకోలేదని తెలిపారు.
ఓట్లు వేసినా వేయకున్నా తాను ప్రజల తరపున పోరాడుతానని… పోరాడుతూనే ఉంటానని తెలిపారు… చాలామంది ఎమ్మెల్యే భిన్నంగా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఓటుకు డబ్బులు ఇచ్చాము కదా పనులు ఎందుకు చేయాలని అంటున్నారని పవన్ ఆరోపించారు…