జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలోపు పార్టీ పట్ల ప్రజలపై నమ్మకాన్ని పెంచాలని చూస్తున్నారు.. అందుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా చేస్తున్నారు… అయితే పార్టీ నేతలు మాత్రం ఛాన్స్ దొరికితే చాలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు సిద్దమవుతున్నారు…
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చింతలపూడి వెంకటరామయ్య పార్థసారథి అద్దెపల్లి శ్రీధర్ బాబు డెవిడ్ రాజు అంతకు ముందు రావెల కిషోర్ బాబులు జనసేనకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇదేక్రమంలో మరో కీలక నేతల జనసేన కు గుడ్ బై చెప్పారు…
గత ఎన్నికల సమయంలో పవన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం తీసుకుని జగ్గయ్యపేటలో నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ధరణి కోట వెంకటరమణ పార్టీకి రాజీనామా చేశారు… తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి అందించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ తీర్థం తీసుకున్నారు… కాగా జగ్గయ్యపేటనుంచి పోటీ చేసిన ధరణికోటకు 1311 ఓట్లు వచ్చాయి… ఇక బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీకాంత్ కు 577 ఓట్లు వచ్చాయి,…