జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ కానున్నారు. ఏపీ రాజకీయాలపై ప్రధానంగా వారితో చర్చించనున్నారు. ప్రతిపక్షాలపై వైసీపీ దాడులను కేంద్ర దృష్టికి తీసుకువెళ్లనున్నారు జనసేనాని. త్వరలోనే పవన్ తన వారాహి వాహనం ద్వారా రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులతో పాటు రోడ్ మ్యాప్ గురించి చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ(BJP)తో పొత్తు ఉన్నా రాష్ట్రంలోని కమలం నేతలు జనసేనను పట్టించుకోవడం లేదని అంశాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెవెళ్లనున్నారు పవన్. అలాగే తెలంగాణ రాజకీయాల గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం. సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ హస్తిన పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో పవన్(Pawan Kalyan) ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
Read Also: పరగడుపునే తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే అద్భుత ప్రయోజనాలు
Follow us on: Google News, Koo, Twitter