Bangalore |భారత సిలికాన్ వ్యాలీగా పేరు గడించిన బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశమంతా పెరిగిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం అద్దె రెట్టింపు అయింది. ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇళ్లకు రెక్కలొచ్చాయి. ఒక్క డబుల్ బెడ్రూం ఇంటికి నెలకు రూ.50వేల అద్దె డిమాండ్ చేస్తున్నారు యజమానులు. ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులోనే అధికంగా ఇంటి అద్దెలున్నాయి. అంతే కాకుండా ఇంటి సైజు పరిణామం కూడా వేరే నగరాల ఇంటి సైజు కన్నా తక్కువగా ఉంటున్నాయి. అయినా కానీ రెట్టింపు అద్దెలు వసూలు చేస్తున్నారు. కరోనా సమయంలో ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేశారు. కరోనా వ్యాప్తి తగ్గిపోవడంతో ఉద్యోగులు బెంగళూరు(Bangalore) చేరుకోవడంతోఅపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడంతో యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు.
Read Also: ఎవరినీ వదిలిపెట్టం.. హిందీ పేపర్ లీక్‌పై సీపీ రంగనాథ్ సీరియస్
Follow us on: Google News, Koo, Twitter