సినీ హీరోయిన్ పూర్ణ(Actress Poorna) తల్లిగా ప్రమోట్ అయింది. దుబాయ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు పూర్ణకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పూర్ణ దుబాయ్ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. కాగా ఆమె నటించిన దసరా మూవీ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. అటు దసరా మూవీ హిట్, ఇటు బిడ్డకు జన్మనివ్వడంతో ఒకేసారి రెండు హ్యాపీ మూమెంట్స్ ను ఆమె ఎంజాయ్ చేస్తోంది.
- Advertisement -
వంటకు కావాల్సిన వాటి కోసం కింద క్లిక్ చేయండి
Read Also: కరోనా, గుండెపోటుకు సంబంధంపై స్పందించిన కేంద్రం
Follow us on: Google News, Koo, Twitter