బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ ఉండగా.. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను రాజాసింగ్ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో జరిగే హనుమాన్ ర్యాలీకి తాను పాల్గొనకుండా ఎలా ఉంటానని తెలిపారు. తనని అరెస్ట్ చేస్తే.. హనుమాన్ భక్తులు ఏదైనా విధ్వంసం సృష్టిస్తే తాను బాధ్యుడని కానని పోలీసులకు స్పష్టంచేశారు. శ్రీరామనవమి సందర్భగా నిర్వహించిన శోభాయాత్రలో ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో హనుమాన్ ర్యాలీలో రాజాసింగ్ పాల్గొంటే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: హీరో రానా తండ్రి కాబోతున్నాడా? మిహీకా బేబి బంప్
Follow us on: Google News, Koo, Twitter