బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్(Jos Buttler) దురదృష్టం రూపంలో ఔటయ్యాడు. చేతివేలి గాయం కారణంగా ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ ను వచ్చిన బట్లర్.. 11 బంతుల్లో 19 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ తరుణంలో ఇన్నింగ్స్ 6వ ఓవరులో నాథన్ ఎల్లీస్ బౌలింగ్ లో ఆన్ డ్రైవ్ షాట్ ఆడటానికి బట్లర్ ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ప్యాడుకు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే అప్రమత్తమైన బౌలర్ ఎల్లీస్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బట్లర్(Jos Buttler) పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఐదు పరుగుల తేడాతో రాయల్స్ జట్లుపై విజయం సాధించింది.
ICYMI – Nathan Ellis grabs a stunner to get the in form batter, Jos Buttler.
Watch it here ??#TATAIPL #RRvPBKS pic.twitter.com/rbt0CJRyLe
— IndianPremierLeague (@IPL) April 5, 2023
Read Also: హీరో రానా తండ్రి కాబోతున్నాడా? మిహీకా బేబి బంప్
Follow us on: Google News, Koo, Twitter