Rajasthan |పర్సనల్ డేటా చోరీ సామాన్యులను ఎంతలా వేధిస్తుందో తెలిపే ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. నేటి డిజిటల్ కాలంలో ప్రతి యాప్ లో మన పర్సనల్ డేటా అందిస్తున్నాం. ఇలా ఇచ్చిన డేటా.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతోంది. ఇటీవల దేశంలోని 67కోట్ల మంది డేటా చోరీ అయిన సంగతి తెలిసిందే. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా. కింద స్టోరీ చదివితే మీకే అర్థమవుతోంది. రాజస్థాన్(Rajasthan) లోని బల్వార్ కిషన్ గోపాల్ అనే వ్యక్తి తన పొట్టకూటి కోసం చిన్న బడ్డీ కొట్టు నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 28వ తేదిన గోపాల్ ఇంటికి ఐటీ నోటీసు వచ్చింది. అది చూసిన అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అందులో రూ.12.23కోట్ల ఐటీ ట్యాక్స్ కట్టాలని ఉంది.
దీంతో బిత్తరపోయిన గోపాల్ దగ్గర్లోని ఛార్టెట్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్లి ఆ నోటీసు చూపించాడు. అది చూసిన అకౌంటెంట్ అతడి పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందని తేల్చాడు. గుజరాత్(Gujarat) రాష్ట్రంలోని సూరత్(Surat) లో రెండు డైమండ్ షెల్ కంపెనీలు బోగస్ లావాదేవిలకు అతని పాన్ కార్డు వాడుకున్నారని గుర్తించాడు. దీంతో కంగుతిన్న బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. తాను నెలకు రూ.10వేలు మాత్రమే సంపాదిస్తున్నానని.. తన పాన్ కార్డు ఎవరు వాడారో తెలియదని మొరపెట్టుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో సత్తా చాటిన తెలంగాణ… అడ్రెస్ లేని ఏపీ
Follow us on: Google News, Koo, Twitter