ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi), అరుణ్ సింగ్(Arun Singh), బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో నేడు(ఏప్రిల్ 7న) బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2004 -09 మధ్య కాలంలో విప్‌గా పనిచేశారు. 2010 14 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
ఆంధ్ర ప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పేరుతో పార్టీ స్థాపించి ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయారు.. ఆ తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ అనంతరం మళ్లీ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరారు. కానీ పెద్దగా యాక్టీవ్‌గా లేరు. ఇటీవలే కాంగ్రెస్(Congress)కు రాజీనామా చేసి బీజేపీ(BJP)లో చేరారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత మెరుగుపడుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని చెప్పారు.
Read Also: ‘TSPSC పేపర్ లీకేజీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం’
Follow us on: Google News, Koo, Twitter