బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్(KCR)పై వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు. ‘‘ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నట్టు? ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు, ముగ్గురిని పడేయడమా? లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా? కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా? JHS, EHS స్కీములను పాతరేయడమా? 104 పథకాన్ని మూసేయడమా? పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా? మీరు హామీ ఇచ్చిన.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు.
రాజధానిలో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవు. ఉస్మానియా హెల్త్ టవర్ లేదు. ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టింపులేదు. పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా దిక్కూ మొక్కూ లేదు. మారుమూల గ్రామాలకు అంబులెన్సులు లేవు. దవాఖాన్లలో సిబ్బంది లేరు. ఆసుపత్రి భవనాలు పాతబడి, పెచ్చులూడుతున్నా సోయి లేదు. ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారు. జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారు.’’ అంటూ కేసీఆర్ సర్కార్‌పై షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: ‘కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది’
Follow us on: Google News, Koo, Twitter