కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. కిరన్ రిజిజు శనివారం జమ్మూలో పర్యటించారు. అయితే రాంబన్ జిల్లాలోని జమ్మూ- శ్రీనగర్ హైవేపై వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ రిజిజు తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. అనంతరం కిరణ్ రిజిజు యధాప్రకారం కారులో తాను హాజరుకావలసిన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. రద్దీ కారణంగా రోడ్ జామ్ అయిందని, ఆ సమయంలో పూర్తి లోడ్‌తో ఉన్న ఒక వాహనం వెనక్కి జారి కిరణ్ రిజిజు కారును ఢీకొందని తెలుస్తోంది. అయితే, రిజిజు క్షేమంగా బయటపడ్డారు.
- Advertisement -
Read Also: మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Follow us on: Google News, Koo, Twitter