ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్

-

David Warner |ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడోసారి ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచులో వార్నర్ సేన 57 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 6 వేల పరుగులు చేసిన తొలి విదేశీ క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో 6వేల పరుగులు చేసిన మూడో క్రికెటర్గా వార్నర్ నిలిచాడు. వార్నర్(David Warner) కంటే ముందు విరాట్ కోహ్లీ(Virat Kohli) 6727, శిఖర్ ధావన్(Shikhar Dhawan) 6370 పరుగులతో ఈ ఫీట్ ను అందుకున్నారు. అయితే కోహ్లీ, ధావన్ కంటే వేగంగా 6 వేల పరుగులు చేసిన బ్యాట్స్మన్గా వార్నర్ రికార్డు సాధించడం విశేషం. కోహ్లీ 188 ఇన్నింగ్స్ లలో 6 వేల పరుగులు చేస్తే..ధావన్‌ 199 ఇన్నింగ్స్‌లో 6వేల రన్స్ చేశాడు. కానీ వార్నర్ మాత్రం 165 ఇన్నింగ్స్‌ల్లోనే 6 వేల పరుగులు చేయడం మరో విశేషం.
Read Also: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు తప్పిన పెను ప్రమాదం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...