మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి సందర్భంగా ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఫూలే దాదాపు రెండొందల ఏండ్ల క్రితమే ఫూలే కార్యాచరణ చేపట్టారని అన్నారు. వారు అనుసరించిన సామాజిక సమానత్వ పంథా, నాటి భారతీయ సమాజంలో కొనసాగుతున్న సాంప్రదాయ సామాజిక విలువలను, వ్యవస్థలను సమూలంగా మార్చివేసేందుకు బాటలు వేసిందని సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. గుణాత్మక మార్పు దిశగా.. దేశంలోని స్త్రీలు, దళిత బహుజనులు ఉద్యమించేలా పూలే కార్యాచరణ పురికొల్పిందని సీఎం కేసీఆర్ అన్నారు.
మహాత్మా ఫూలే(Mahatma Jyotirao Phule)ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Ambedkar) స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఫూలే వంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకుని అభివృద్ధి సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తున్నదని కేసీఆర్(CM KCR) అన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో ‘వికాసమే వివక్షకు విరుగుడు’ అనే విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమించాయని పేర్కొన్నారు.
Read Also: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
Follow us on: Google News, Koo, Twitter