తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని(Ambedkar Statue) ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14) రోజున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar) ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి భారీగా జనాలు పాల్గొన్నారు. ఆవిష్కరణకు ముందు బుద్ధ మంత్రం విన్నారు. అనంతరం హెలికాప్టర్లతో భారీ అంబేద్కర్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహంపై(Ambedkar Statue) హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు ప్రజాప్రతినిధులు వీక్షించారు. అనంతరం కేసీఆర్ జై భీమ్(Jai Bheem) అని నినదించారు. అంబేద్కర్ విగ్రహా శిలా పలకాన్ని సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు.
Read Also: మొదటిసారి ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎలన్ మస్క్
Follow us on: Google News, Koo, Twitter