కోర్టు తీర్పుతో అనర్హత వేటు ఎదుర్కొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక నివాసంలోని సామాన్లను శుక్రవారం ట్రక్కుల్లో 10 జన్ పథ్‌లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి తరలించారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు(Surat Court) రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ ఎంపీ పదవిని కోల్పోయాడు. ఈ క్రమంలో తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ రాహుల్ గాంధీకి గత నెలలో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 వరకు నివాసం ఖాళీ చేసేందుకు గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే రాహుల్ గాంధీ(Rahul Gandhi) నివాసంలోని వస్తువులను ఇవాళ కార్మికులు తరలించడం కనిపించింది.
Read Also: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు CBI నోటీసులు
Follow us on: Google News, Koo, Twitter