భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా నన్పూర్‌లో ‘జై భారత్ సత్యాగ్రహ యాత్ర’ పేరుతో బహరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడ్ని ముఖ్యమంత్రి చేసేలా కృషి చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అడుగుతామని వివరించారు. కేంద్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కుట్ర పూరితంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
అంతేగాక, గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) సైతం దళితులను తీవ్రంగా మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా దళితులకు చేసిందేమీ లేదని విమర్శించారు. భారీ విగ్రహం పెడితే దళితులకు అండగా ఉన్నట్లా? అని ప్రశ్నించారు. ఇంతకాలం రాష్ట్ర కేబినెట్‌లో మాదిగలకు ఎందుకు స్థానం కల్పించలేదని అడిగారు. దళిత నాయకుడు ఖర్గేను తమ పార్టీ అధ్యక్షుడిని చేసిందని గుర్తుచేశారు. అంతేగాక, ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) పార్టీ వీడితే ఎలాంటి నష్టం లేదని కొట్టిపారేశారు. తానూ పార్టీ వీడుతున్నట్లు ఎన్నో ప్రచారాలు చేశారని, చచ్చే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. అంతేగాక, రాష్ట్రంలో తాను పాదయాత్ర చేయడం లేదనీ క్లారిటీ ఇచ్చారు.
Read Also: అధికారిక నివాసం ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. ట్రక్కుల్లో వస్తువుల తరలింపు
Follow us on: Google News, Koo, Twitter