మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar).. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha), ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Arvind Kejriwal)పై సంచలన ఆరోపణలు చేస్తూ.. లేఖలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో ఐదు పేజీల లేఖలు విడుదల చేసి మరో సంచలనానికి తెరలేపాడు. ఎమ్మెల్సీ కవిత ఫోన్ నెంబర్లను చెబుతూ స్క్రీన్ షాట్‌ను విడుదల చేశాడు. త్వరలోనే కేజ్రీవాల్‌తో చేసిన చాటింగ్ చాట్స్‌ను కూడా విడుదల చేస్తానని ప్రకటించాడు. తీహార్ క్లబ్‌కు కవిత, కేజ్రీవాల్‌కు స్వాగతమంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేగాకుండా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు సుకేశ్ ప్రకటించాడు. కేజ్రీవాల్ తర్వాత కవిత(MLC Kavitha) వంతే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలపై సుఖేశ్ స్పందించాడు. కవిత విమర్శలు అర్ధరహితం అని కొట్టిపారేశారు.
Read Also: స్త్రీ తన కన్నా వయసు ఎక్కువున్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి..?
Follow us on: Google News, Koo, Twitter