ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం(ఏప్రిల్ 16) సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ.. నాలుగు గంటలుగా కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)పై సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్(Arvind Kejriwal) పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా(Manish Sisodia) సహా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Read Also: వివేకా హత్య కేసు.. తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద చేపలు
Follow us on: Google News, Koo, Twitter