వివేకా హత్య కుట్ర అవినాశ్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ

-

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy ) ముందస్తు బెయిల్ తెలంగాణ హైకోర్టులో విచారణ వాడివేడిగా జరుగుతోంది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన సీబీఐ(CBI).. వివేకా హత్య కేసులో(Viveka Murder Case) అవినాశ్ ది కీలక పాత్ర అని.. హత్య కుట్ర ముందే తెలుసని తెలిపింది. అతడి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని.. అందుకే అతనికి బెయిల్ ఇవ్వొదని కోర్టును కోరింది. గత నాలుగు విచారణల్లో కూడా అవినాశ్ సహకరించలేదని.. విచారణకు పిలిచినప్పుడల్లా కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపింది.

- Advertisement -

హత్యకు ముందు, తర్వాత అవినాశ్(Avinash Reddy ) ఇంట్లో నిందితులు సునీల్, ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారని చెప్పింది. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలని పేర్కొంది. హత్య జరిగిన రోజు రాత్రంతా అవినాశ్ తన ఫోన్ ను వాడుతూనే ఉన్నాడని వెల్లడించింది. హత్య జరిగిన రోజు జమ్మలముడుగు దగ్గర్లో ఉన్నట్లు విచారణలో తెలిపాడని.. కానీ మొబైల్ సిగ్నల్స్ చూస్తే పులివెందులలోని తన ఇంట్లోనే ఉన్నట్లు తేలిందని వాదనలు వినిపించింది. కాగా మరికాసేపట్లో అవినాశ్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది.

Read Also: జగన్ ఇలాఖాలో చంద్రబాబుకు జలక్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...