విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా అఖిలపక్షం నేతలు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. ‘నిరుద్యోగుల గోస – అఖిలపక్షం భరోసా’ పేరిట మంగళవారం నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్(Congress), న్యూ డెమోక్రసీ(New Democracy), బీఎస్పీ(BSP), టీజేఎస్(TJS), ఆప్(AAP) పార్టీ లకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మాట్లాడుతూ జైల్లో ఉన్న TSPSC నిందితులకు ప్రాణహాని ఉందంటూ బాంబ్ పేల్చారు.
ఛైర్మన్, కమీషన్ సభ్యులకు పేపర్ లీక్ గురుంచి ముందే తెలుసన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ లో 103 మార్కులు తెచ్చుకున్న ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ ను మార్చింది TSPSC బోర్డ్ సభ్యులని ఆరోపించారు. 16 నుంచి 20 మందికి టీఎస్పీఎస్సి ఉద్యోగులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నారని మండిపడ్డారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో తొందరగా దర్యాప్తు జరుగుతుంది, కానీ.. 37 రోజులు అవుతున్నా TSPSC పేపర్ లీక్ ఘటన మీద సిట్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదని ఆర్ఎస్పీ ఫైర్ అయ్యారు.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) పోలీసులను తప్పు డైరెక్షన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు సభ్యుల పీఏ లకు గ్రూప్ 1 లో 100 మార్కులు వచ్చాయని ఆరోపించారు. ఇప్పటి వరకు TSPSC బోర్డ్ సభ్యుల మొబైల్ ఫోన్లు సీజ్ కాలేదని అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని, నిజం నిర్భయంగా చెప్పండి అని సూచించారు. టీఎస్పీఎస్సీ లో బోర్డ్ సభ్యులు రాజీనామా చేస్తున్నారని తెలిపారు. జైల్లో ఉన్న TSPSC నిందితులకు ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
Read Also: తాయత్తు మహిమతోనే నేను ఇంతటి వాడిని అయ్యాను: డీహెచ్
Follow us on: Google News, Koo, Twitter