అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గుంగుల భానుమతి ఇంట విషాదం చోటు చేసుకుంది…ఆమె తండ్రి రుద్రప్పగౌడ్ ఇవాళ మృతి చెందారు… కొద్దికాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు… ఇంటి దగ్గర ఉండి చికిత్స తీసుకుంటున్నారు…
ఈ రోజు ఆయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు… విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు… అలాగే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు రుద్రప్పగౌడ్ మృతదేహానికి సంతాపం తెలిపారు…
భానుమతి మద్దలచేర్వు సూర్యనారాయణ రెడ్డి భార్య… ఆయన రాప్తాడు నుంచి 2004లో పోటీ చేసి పరిటాల రవీంధ్ర చేతిలో ఓటమి చెందారు… ప్రస్తుతం ఆయన భార్య భానుమతి వైసీపీలో ఉన్నారు.