రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. రియల్ ఏస్టేట్, సినిమా ఇండస్ట్రీ, ఇలా అన్ని వ్యాపార సంస్థలపై గత కొన్ని రోజులుగా విస్తృతంగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండ్రోజులు మైత్రీ మూవీస్ నిర్మాతల ఆఫీసులో ఇన్కం ట్యాక్స్ అధికారులు దాడులు జరుపుతున్నారు. నిర్మాతల ఇళ్లపైనే కాకుండా.. డైరెక్టర్ సుకుమార్ ఇళ్లు, కార్యాలయాలపైనా తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ సంస్థ లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా జరిపిన సోదాల్లో అనేక విషయాలు గుర్తించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మైత్రీ నిర్మాణ సంస్థ(Mythri Movie Makers) గత కొన్నేళ్లుగా టాలీవుడ్ బడా హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. వీరి నిర్మాణంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, ఉప్పెన, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, పుష్ప 1 లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.
ప్రస్తుతం ఈ సంస్థ నిర్మాణంలో పుష్ప-2, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాల పెట్టుబడులు, ఆదాయం లాంటి వ్యవహారాల గురించి ఐటీ అధికారులు సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు మైత్రీ(Mythri Movie Makers) నిర్మాతలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి సంస్థలో కొందరు రాజకీయ నాయకులు కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల మొయినాబాద్, శంకర్ పల్లి లాంటి ప్రాంతాల్లో వందల కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్.. భారీ చిత్రాల నిర్మాణం కోసం ముంబైలో ఫైనాన్షియర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలకు సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ లేవని ఐటీ అధికారులు గుర్తించారట.
Read Also: నాని ‘దసరా’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Follow us on: Google News, Koo, Twitter