ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తాం.. బీజేపీ కార్యాలయానికి బెదిరింపు లేఖ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఈనెల 24, 25 తేదీల్లో కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటనకు ముందే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని కేరళకు వస్తే ఆత్మాహుతి దాడికి పాల్పడుతామంటూ ఆ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఓ లేఖ వచ్చింది. ఈ బెదిరింపు(Death Threat Letter) లేఖలో దానిని పంపినవారి పేరు, ఇతర వివరాలు కూడా ఉన్నాయి. ఈ నెల 24న ప్రధాని మోదీ(PM Modi) కొచ్చి పర్యటన సమయంలో ఆయనపై ఆత్మాహుతి దాడి చేస్తామని ఈ లేఖలో ఉంది. ఈ లేఖను రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కే సురేంద్రన్ గత వారం పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

ఈ సమాచారం శనివారం బయటకు పొక్కింది. నిఘా విభాగం ఏడీజీపీ నివేదిక మీడియాలో రావడంతో ఈ లేఖ గురించి బయటపడింది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నాయి. బయటకు పొక్కిన ఈ పత్రంలో చాలా తీవ్రమైన భద్రతాపరమైన ముప్పుల గురించి పేర్కొన్నారు. నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ముప్పు ఉన్నట్లు దీనిలో తెలిపారు.

Read Also: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన అమృత్‌పాల్ సింగ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...