పెండింగ్ బిల్లులపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై(Governor Tamilisai) కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లలను ప్రభుత్వానికి తిరిగి పంపి అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును గవర్నర్ తిరస్కరించారు. అంతేగాక, పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు, ప్రయివేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే, 2022 సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశ పెట్టి.. ఉదయ సభల ఆమోదం అనంతరం రాజ్‌భవన్‌కు పంపింది. వాటిల్లో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే ఆమోద ముద్ర వేసి, మిగతా ఏడు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. దీంతో సర్కార్, గవర్నర్(Governor Tamilisai) మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తమిళి సైపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
Read Also: హిండెన్‌బర్గ్ రిపోర్టుతో అందరికీ సినిమా అర్ధమైపోయింది: KTR
Follow us on: Google News, Koo, Twitter