పులివెందులకు సీఎం జగన్ వరాలే వరాలు

పులివెందులకు సీఎం జగన్ వరాలే వరాలు

0
88

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు… రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు, అలాగే అభివృద్దే లక్ష్యంగా చేసుకుని పలు సమీకరణాలు చేస్తూ ఆదిశగా అడుగులు వేస్తున్నారు…

ఇప్పటికే నవరత్నాల్లో పొందుపరిచిన అంశాలనే కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్నికార్యక్రమాలకు శ్రీకారాం చుట్టారు… అందులో భాగంగానే తన జిల్లా సొంత జిల్లా వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు…

దీనికి డిసెంబర్ లో శంకుస్థాపన చేయాలని జగన్ చెప్పారు… సుమారు పదికోట్ల అభివృద్ది ప్రతిపాధనలను సిద్దం చేయాలని సూచించారు జగన్… అలాగే వేముల మండలం నల్లచెరువు పల్లిలో 132 కేవీ జబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయిచారు… నియోజకవర్గంలో 11 ప్రాథమిక ఆరోగ్యా కేంద్రాలు పులివెందుల ఏరియా ఆసుపత్రికి వేంపల్లి సీహెచ్ సీకి 30 కోట్లు మౌలిక సౌకర్యాలను కల్పించాలని జగన్ ఆదేశించారు..