పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి చంచల్ గూడ మహిళా జైల్లో ఉన్న షర్మిల(YS Sharmila)ను కలిసేందుకు మంగళవారం ఉదయం వైఎస్ విజయలక్ష్మి(YS Vijayamma) వచ్చారు. అంనతరం తన కూతురుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకే షర్మిలను అరెస్ట్ చేశారని విజయలక్ష్మి అన్నారు. షర్మిల బెయిల్‌పై బయటకు వస్తుందని, ప్రజా సమస్యలపై మళ్లీ పోరాటం సాగిస్తుందన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే షర్మిలను అరెస్ట్ చేసిందన్నారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలన్నారు. షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. ఆమె ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినా పోలీసులు అడ్డు పడుతున్నారు. షర్మిల ఏమైనా టెర్రరిస్టా? హంతకురాలా? అని ప్రశ్నించారు.
Read Also: ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవ ముహుర్తం ఖరారు
Follow us on: Google News, Koo, Twitter