తెలంగాణలో మళ్లీ రాబోయేది కేసీఆర్(KCR) ప్రభుత్వమే. రాష్ట్రానికి మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యి దక్షిణాది నుంచి హ్యాట్రిక్ సాధించిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించనున్నారని మంత్రి కేటీఆర్(KTR) జోస్యం చెప్పారు. బుధవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. మేం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతాం. తొ మ్మిదేండ్లలో తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఇదే చెప్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ ప్రతినిధుల సమావేశాలు జరిగాయి. అద్భుతంగా కార్యకర్తలు పాల్గొన్నారు.
జూన్‌లో పార్టీ విద్యార్థి, యువజన సమ్మేళనాలు నిర్వహించనున్నాం. విద్యారంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, వెయ్యికి పైగా గురుకులాల ఏర్పాటు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, నిరంతరం ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగాల భర్తీ చేపట్టడం వంటివాటిని విద్యార్థులకు, యువతకు వివరిస్తాం. వరంగల్‌లో అక్టోబర్‌లో సభ ఉన్నది. నిరంతరం ఏదో ఒక సభ, సమావేశం నిర్వహిస్తూనే ఉన్నాం. ప్రజల్లోనే ఉంటున్నాం. ప్రజల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడుతున్నాం. గురువారంనాటి ఆవిర్భావ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల రూట్‌మ్యాప్‌పై స్పష్టత ఇస్తారని కేటీఆర్(KTR) అన్నారు.
Read Also: శ్వేత మృతి కేసులో సెన్సేషనల్ ట్విస్ట్.. వెలుగులోకి సూసైడ్ లెటర్!
Follow us on: Google News, Koo, Twitter