హైదరాబాద్(Hyderabad)లోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాఘవ లాడ్జీ వద్ద మద్యం మత్తులో వాచ్‌మెన్‌తో నలుగురు డ్యాన్సర్లు గొడవ పడ్డారు. మాటామాటా పెరిగి గొడవ పెద్దది కావడంతో కోపం ఆపుకోలేకపోయిన డ్యాన్సర్లు వాచ్‌మెన్‌ను మూడో అంతస్తు పైకి లాక్కెళ్లి కిందకి తోసేశారు. దీంతో తీవ్ర గాయాలైన వాచ్‌మెన్ యాదగిరి అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, డ్యాన్సర్లు చెన్నై నుంచి వచ్చి రాత్రి లాడ్జీలో బస చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్ చేరుకొని ఆరా తీయగా.. మద్యం తాగి గొడవ చేయొద్దని వాచ్‌మెన్ సూచించినందుకే అతన్ని కొట్టిచంపినట్లు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.