Raja Singh |టీడీపీలో చేరికపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ

-

టీడీపీ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పందించారు. తాను బీజేపీ లోనే ఉంటానని.. బీజేపీ ని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు రాజాసింగ్. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ లో చేరాలని ఎప్పుడు ఆలోచన చేయలేదని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుండి ఎమ్మెల్యే  అభ్యర్థిగా పోటీ చేస్తానని  తెలిపారు. నా మెంటాల్టీకి బీజేపీ తప్ప మరేతర పార్టీ సెట్ అవ్వదని.. ఎవరు కూడా తనను తీసుకోరని సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ(TDP) కార్పొరేటర్ 2009 నుండి 2014 వరకు ఉన్న రాజా సింగ్.. 2014 లో బీజేపీ లో చేరి గోషా మహల్ ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2018 లో బీజేపీ నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే గా రాజా సింగ్ నిలిచారు.

- Advertisement -

రాజా సింగ్ మునావర్ ఫారూఖీ స్టాండ్ అప్ కామెడీ కి వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియో లో ప్రవక్త పై అవమానకరమైన పదజాలం ఉండడంతో పోలీసులు ఆయనపై పిడి యాక్ట్ కేసు నమోదు చేసి జైలులో పెట్టారు. ఈ విషయంలో రాజా సింగ్(Raja Singh) పై సీరియస్ అయిన బీజేపీ అధిష్టానం ఆయన పై 6 నెలలు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. తనపై సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు మద్దతుగా ఉన్నట్లు తెలియజేసారు.

Read Also: 2 వేల కోసం స్మగ్లింగ్ … చివరికి బోర్డర్ లో..
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...