తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభానికి ముందురోజు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కీలక సందేశం పంపించారు. అనేక త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలను ఇముడింపజేసేలా అద్భుతంగా కొత్త సచివాలయం నిర్మించుకున్నామని తెలిపారు. సచివాలయ ప్రారంభం యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భం అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కొత్త సచివాలయ(New Secretariat) ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం సకల జనులు మెచ్చే సంక్షేమ పాలనను అందిస్తున్నదని వ్యాఖ్యానించారు. యావత్తు జాతి మెచ్చే సుపరిపాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలనే మహోన్నత లక్ష్యంతో, స్పష్టమైన తాత్వికత, సైద్దాంతిక అవగాహనతోనే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్(Ambedkar) పేరును కొత్త సచివాలయానికి పెట్టుకున్నామన్నారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ ధృఢ సంకల్పంతో నూతన సచివాలయ నిర్మాణం జరిగిందని, దేశానికే వన్నె తెచ్చేలా పూర్తి చేసుకున్నామని, ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. లాంఛనంగా ప్రారంభోత్సవం చేయడానికి ముందు ముఖ్యమంత్రి(CM KCR) ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు.
Read Also: కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం.. గద్దర్ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter